-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్,జడ్పిటిసి మంగమ్మ, రామచంద్రం
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం రోజు రామాలయం మట్టి వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్, తాజా మాజీ జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, మాజీ నాచారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ హరి పంతులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజ్ఞేశ్వరుడి దయతో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాజశేఖర్ శర్మ,ఆలయ కమిటీ సభ్యులు నరేందర్ రెడ్డి, అశోక్,లక్ష్మణ్,కిష్టారెడ్డి, వెంకట్ రెడ్డి,రమేష్,ఆంజనేయులు,వెంకటేష్ ,నర్సింగరావు, ప్రభాకర్,నరేష్, మల్లారెడ్డి, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.





