గర్మిల్ల లయన్స్ క్లబ్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో చెన్నూర్ లో కంటి వైద్య శిబిరం విజయవంతం.
రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ మరియు గరిమిళ్ళ లయన్స్ క్లబ్ మంచిర్యాల వారు సంయుక్తంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో జరిగిందని, శిబిరం లక్ష్యాన్ని మించి విజయవంత కావడం పట్ల గరిమిళ్ళ లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మోదుంపురం వెంకటేశ్వర్ హర్షం వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పరిసర ప్రాంత ప్రజలు కంటి ఆపరేషన్ కోసం తరలి వచ్చి సుమారుగా 300 మంది తమ పేరును నమోదు చేసుకొని బీపీ, షుగర్, కంటి పరీక్షలు చేయించుకున్న అనంతరం 140 మంది కంటి ఆపరేషన్ కోసం అర్హత సాధించినట్లు రేకుర్తి కంటి నిపుణులు ప్రభాకర్, డాక్టర్ అభిషేక్,డాక్టర్ భాస్కర్ రెడ్డిలు ప్రకటించారు. వారందరిని ఉచిత భోజన వసతితో పాటు రాను పోను ఉచిత బస్సు ప్రయాణం ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తారు అని తెలిపారు.వారి వెంట ఒక అటెండెంట్ కు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉచిత భోజనము వసతి ఉంటుందని తెలిపారు. రేకుర్తి కంటి ఆసుపత్రి గైడ్లైన్స్ ప్రకారము మొదటి విడుతగా 30 మందిని తరలించారు.
మిగతా వారిని విడుదలవారీగా రేకుర్తికి పంపించి ఆపరేషన్లు చేయించనున్నట్టు తెలిపారు. ఈ శిబిరం విజయవంత కావడంలో అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ అధ్యక్షులు శ్రీ కే. రామయ్య , శ్రీ పద్మనాభ చారి, శ్రీ జాడి తిరుపతి, శ్రీ మోహన్, స్థానిక ఆర్ఎంపి వైద్యులు సిరంగి సంపత్, మహేష్, ఆశా సిబ్బంది, సత్యసాయి సేవా సమితి బృందం సహకార అందించినట్టు తెలిపారు.వారందరికి ధన్యవాదములు తెలిపారు. ఇకముందు కూడా పలు సేవాకార్యక్రమాలను చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జోన్ చైర్ పర్సన్ లయన్ సద్దనపు రామచందర్, గరిమిళ్ళ లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ సుధాకర్, లయన్ కాసం మల్లికార్జున్, లయన్ బాలాజీ, లయన్ వేముల ప్రవీణ్ తో పాటు స్థానిక సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.






