మంచిర్యాల జిల్లా, మంచిర్యాల రైల్వే స్టేషన్.
నేడు సికింద్రాబాద్ – నాగ్ పూర్ మధ్య ప్రారంభం అయిన వందే భారత్ రైలును మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల రైల్వే స్టేషన్ లో నిరసన తెలిపిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు వ్యారస్థులకు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులకు రఘునాథ్ వెరబెల్లి సంఘీభావం తెలుపడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే లో మంచిర్యాల రైల్వే స్టేషన్ A గ్రేడ్ స్టేషన్ అయినప్పటికీ ఇక్కడ ప్రధాన రైళ్ళు మంచిర్యాల లో ఆగకపోవడంతో దూరప్రాంత ప్రయాణికులు మరియు వ్యాపారస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వందే భారత్ రైలు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అని తెలిపారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ అధికారులు వాస్తవ పరిస్థుతులను తమ పై అధికారుల దృష్టికి తీసుకవెళ్లాలని కోరారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు లేవనెత్తిన అంశాలను త్వరలో రైల్వే మంత్రి దృష్టికి తీసుకవెళ్లి వందే భారత్ రైలు మంచిర్యాల లో ఆగే లాగా కృషి చేస్తానని తెలిపారు.
