Breaking News

నాయుడుపేటలో ఉచిత కంటి వైద్య శిబిరం

120 Views

పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రలయ ఆధ్వర్యంలో నాయుడుపేట లోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల జనరల్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేశామని మేనేజింగ్ డైరెక్టర్ చాగణం గౌరిశంకర్, సీఈవో సీతారామ నాయుడు ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలకు సీనియర్ వైద్య నిపుణులైన అనుభవం గల స్పెషలిస్ట్ డాక్టర్
లహరి ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు, సూచనలు ఇవ్వడం‌ జరిగింది అన్నారు.
ఈ ఉచిత వైద్య శిబిరం లో 160 మంది కి పరీక్షలను ఉచితముగా నిర్వహంచి 60 మందికి ఉచితముగా మందులు పంపిణీ 22 రోగులకు ఉచిత కంటి అద్దాలు, 44 మందికి ఉచితంగా ఆపరేషన్ లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ AO కృష్ణ గల్లా, అరవింద్ నేత్రలయ సిబ్బంది దిలీప్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్