మే 7, 24/7తెలుగు న్యూస్:నేస్తం సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళ మృతదేహానికి అంత్యక్రియలు.
మైదుకూరు ముదిరెడ్డి పల్లెకు చెందిన నరసమ్మ (45 సం) మహిళా అనారోగ్య కారణంగా మృతి చెందడంతో అల్ తెలుగు ప్రజా పార్టీ నాయకుడు మహబూబ్ షరీఫ్ మైదుకూరు నేస్తం సేవా సంస్థకు సమాచారం ఇవ్వగా నేస్తం సేవా సంస్థ సభ్యులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని టాటా సుమోలో చాపాడు కుందునది వద్దకు తరలించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో మైదుకూరు నేస్తం సేవా సంస్థ సభ్యులు కోగటం కొండారెడ్డి,మహబూబ్ షరీఫ్,బాబు,ఉబ్బరపు నాని,మనోజు కుమార్ తదితరులు పాల్గొన్నారు..




