ఆలుమగలందరూ హాయిగా కాలం గడపాలి, వేయ్యేళ్ళు అనుకూలంగా ఒకటై బ్రతకాలి.
సతులందరూ వారి ధర్మం పతి సేవేయని పతి భక్తిని చూపాలి, అనుదినము అత్త మామల పరిచర్యలు చేయాలి, బంధు జనాల అభిమానం పొందాలి, పదిమంది వారి సుగుణాలను పలుమార్లు పొగడాలి.
ఇల్లాలే ఇంటికి వెలుగు, సంసారపు బండికి వారే చక్రం. శరీరాలు వేరే కానీ మనసొకటే అంటూ మసలాలి, సుఖాన్నైనా దుఃఖాన్నైనా సగపాలుగా పంచుకోవాలి.
ఇరుగుపొరుగు వారితో ఇంటి సంగతులు మాట్లాడకూడదు. చీరలు నగలిమ్మని భర్తను చీటికి మాటికి అడగరాదు కూడా. పుట్టింటిని అస్తమానం పొగడరాదు. తరుణం దొరికిందే చాలని సమయాన్ని అనుకూలంగా మార్చుకోకండి.
