Breaking News

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని నేడు జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలు ప్రారంభం

118 Views

03.12.2022 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని నేడు జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలను సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అంధ, భధిర, శారీరక మరియు మానసిక దివ్యాంగులకు జూనియర్ మరియు సీనియర్ కేటగిరీలలో ట్రై సైకిల్ రేస్, పరుగు పందెం, చెస్, క్యారం, జావలిన్ త్రో మరియు షాట్ పుట్ లలో పోటీలు నిర్వహించడమైనది. ఇట్టి పోటీలను అదన కలెక్టర్ ముజమీల్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేరుగు రాజనర్సు, జిల్లా స్పోర్ట్స్ అధికారి నాగేందర్, వార్డ్ కౌన్సిలర్ శ్రీదేవి బుచ్చిరెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొని పోటీలను జండా ఊపి ప్రారంభించారు. విద్యాశాఖకు చెందిన పలువురు పీఈటీలు, పీడీలు దివ్యంగులకు సూచించిన పలు అటల పోటీలను నిర్వహించి వాటిలో మొదటి రెండవ స్థానాలకు దివ్యాంగులను ఎంపిక చేసినారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మూజమీల్ ఖాన్ మాట్లాడుతూ అంగ వైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు, మేధస్సుకు కాదని, దివ్యాంగులు ఎవరికి తీసి పోరని, వారిని ప్రోత్సహిస్తే వారికున్న మేధాశక్తితో అద్భుతాలు ఆవిష్కరించగలరని ఈ పాటల పోటీలలో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. జిల్లా స్థాయిలో వివిధ ఆటల పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచిన వారు రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలకు పంపించబడతారని వారు తప్పక సిద్దిపేట జిల్లాకు పలు క్రీడలలో బహుమతులు పేరు తేవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కడవెరుగు రాజనర్సు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల క్రితమే మంత్రివర్యులు ప్రత్యేక చొరవతో వికలాంగులకు ఒక ప్రత్యేకమైన సంఘ భవనాన్ని కాలకుంట కాలంలో నిర్మించామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్నో రకాలుగా ప్రత్యేక పథకాలు చేపట్టి వారికి మూడు వేల రూపాయల పెన్షన్, డబల్ బెడ్రూంలో కేటాయింపులు చేపడుతున్నామని ఇంకా వారి పట్ల ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ ఆటల పోటీలలో ఉత్సాహంగా పాల్గొని సిద్దిపేట జిల్లాకు రాష్ట్రస్థాయిలో పేరు తేవాలని సూచించారు. ఈ క్రీడోత్సవాలలో అభయ జ్యోతి మానసిక వికలాంగుల పాఠశాలకు చెందిన విద్యార్థులు, లైన్స్ క్లబ్ బాధ్యులు జ్యోతి అలాగే చర్యాల పట్టణానికి చెందిన మనో చేతన మానసిక వికలాంగుల పాఠశాల నిర్వాహకులు, పిల్లలు, జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం బాధ్యులు, వివిధ మండలాల వచ్చిన దివ్యాంగులు, అంధ ఉద్యోగుల సంఘం నుంచి సంక్షేమ సంఘం బాధ్యులు అనిల్, శ్రీనివాస్ మరియు నందన్ వివిధ సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7