ఉండటానికి ఇల్లు లేదు, ఆదరించేందుకు భర్త లేడు .ఉన్న పిల్లలు అనాధను చేసి వెళ్ళిపోయారు. రేషన్ కార్డు లేదు పింఛన్ అసలే లేదు. తన బ్రతుకు ఎలా అంటూ ఓ గిరిజన వృద్ధ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది తనను అధికారులు ఆదుకోవాలని వేడుకుంటుంది.గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరు గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న
ఏ కొల్లు రమణమ్మ (56 )అనే గిరిజన మహిళ నాలుగు ఇళ్లలో పాచిపని చేసి జీవనం సాగిస్తోంది. భర్త చనిపోయి 20 సంవత్సరాలైనా రేషన్ కార్డు లేని కారణంగా ప్రభుత్వం ద్వారా అందించే పింఛన్ కూడా అందుకోలేకపోతోంది. అలాగే బియ్యం కూడా రావడం లేదు. ఎంతోమంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతుండగా అన్ని అర్హతలు ఉన్న ఈ గిరిజన వృద్ధ మహిళ మాత్రం ప్రభుత్వ పథకానికి నోచుకోకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.. వయసు పై పడడంతో అనారోగ్య సమస్యలు వచ్చిన అలాగే పస్తులతోనే కాలం వెళ్ళదీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉండేందుకు సొంత ఇల్లు లేకపోవడంతో ఎవరో ఒకరు ఇంటిలో తలదాచుకుంటుంది. తనకు రేషన్ కార్డు పింఛన్ ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేదని ఆమె వాపోయింది. ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన అంటూ సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చినప్పటికీ అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదనడానికి ఈ గిరిజన మహిళ ఉదాహరణ. అనారోగ్యం పాలైతే చూపించుకునే పరిస్థితి కూడా ఆమెకు లేదు. పిల్లలు పెళ్లిళ్లు ఈమెను ఒంటరి చేసి వెళ్లిపోగా తలదాచుకునేందుకు నీడ కూడా లేక అవస్థలు పడుతోంది .. ప్రభుత్వ పథకాలు ఏవో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఆ మహిళ ఉందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు రేషన్ కార్డుతో పాటు విడో లేకుంటే వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని ఆమె వేడుకుంటూ ఉంది. అధికారులు కనికరించి తనకు రేషన్ కార్డు తో పాటు పింఛన్ ఇచ్చే లాగున చర్యలు తీసుకోవాలని గిరిజన మహిళ ఉంది ఈమె మొరను అధికారులు ఆలకించి పింఛన్ మంజూరు చేస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది.




