*సర్వేపల్లిలో నువ్వేం మిగిల్చావని ఇప్పుడు దోపిడీ జరుగుతుంది*
*ఇంగిత జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం మానుకో*
*పురాణాల్లో దేవుళ్ల యజ్ఞాలను రాక్షసులు చెడగొట్టిన విధానంలోనే గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు*
*ఇంట్లో కూర్చుని అందరిపై విమర్శలు చేస్తూ గడిపేస్తున్నాడు*
*సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి విమర్శలపై ప్రజలు నవ్వుకుంటున్నారు. వాటిని పట్టించుకోకుండా సర్వేపల్లి సమగ్ర అభివృద్ధి ప్రయత్నంలో ముందుకు సాగాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కోరుతున్నా*
*పొదలకూరు మండలం సూరాయపాళెం రీచ్ సందర్శన సందర్భంగా మీడియాతో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి*
వైసీపీ ఐదేళ్ల పాలనలో అస్తవ్యస్త విధానాలు, దోపిడీతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దివాళా తీయించారు
జగన్మోహన్ రెడ్డి నుంచి ఎమ్మెల్యేల స్థాయి వరకు చేసిన అడ్డగోలు పనులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి
ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశ్ అని ప్రపంచంలో చెడ్డపేరు వచ్చిన పరిస్థితుల్లో విజ్ఞులైన ప్రజలు ఆలోచించి చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసీపీ తుడిచిపెట్టుకుపోయి తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది
చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ఒక్కో పథకాన్ని అమలు చేయడంతో పాటు పోలవరాన్ని పూర్తి చేసే దిశగా అడుగులు వేయడంతో పాటు రాజధాని అమరావతిని అగ్రభాగాన నిలిపేందుకు శ్రమిస్తున్నారు
ప్రకృతి విపత్తులను సైతం ఎదుర్కొని మూడు నెలల్లోనే శభాష్ అనిపించుకుంటూ పాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడిని చూసి జగన్మోహన్ రెడ్డి నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి వరకు మతి భ్రమించి మాట్లాడుతున్నారు
కాకాణి గోవర్ధన్ రెడ్డిది నోరా..తాటి మట్టా…కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నాడా
గతంలో విదేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులని ఫోర్జరీ డాక్యమెంట్లు తెచ్చాడు…ఈ రోజుకీ ఆ కేసు విషయంలో కోర్టులు, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు
ఇప్పుడేమో సూరాయపాళెం రీచ్ లో ఒక్క ట్రాక్టర్ ఇసుక తోలకుండానే రూ.100 కోట్ల దోపిడీ అంటున్నాడు
కాకాణి గోవర్ధన్ రెడ్డికి రాత్రి పూట కలలు ఎక్కువగా వస్తున్నట్టున్నాయ్…ఐదేళ్లుగా తాను చేసినట్టే అందరూ అక్రమాలు చేస్తారని కలలు కంటూ గడిపేస్తున్నాడు
ఆయనకు ఇంగిత జ్ఞానం ఉన్నా,,నిఖార్సైన రాజకీయ నాయకుడైనా సూరాయపాళెం రీచ్ వద్దకు రావాలి..రూ.100 కోట్లు సోమిరెడ్డి తినేశాడని ఆధారాలు చూపించాలి
ఇకపై ఆయన కాకాణి గోవర్ధన్ రెడ్డి కాదు…సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి
పైసా ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చుని, ఒక కెమెరా పెట్టుకుని ఇష్టం వచ్చిన వీడియోలు పెట్టుకుంటున్నాడు
చంద్రమోహన్ రెడ్డి నుంచి చంద్రబాబు నాయుడు వరకు, నారా లోకేష్ బాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకు అందరిపై ఇష్టారీతిగా విమర్శలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు.
అసలు సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దోచుకునేందుకు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏమి మిగిల్చాడు
అంతా దోచేసుకుని ఇప్పుడు దోచుకుంటున్నారు..దాచుకుంటున్నారు అని గగ్గోలు పెట్టడానికి అసలు ఇక్కడ ఏముందని
మట్టి నుంచి క్వార్ట్జ్ వరకు దేనినీ వదిలిపెట్టలేదు. డీఫారం పట్టాల నుంచి ఆలయ భూముల వరకు అన్నీ దోచేసుకున్నాడు
కంపెనీల ప్రతినిధులు వచ్చి ఫ్యాక్టరీలు పెట్టబోతే వాళ్లను కోట్లకు కోట్లు కావాలంటూ అడ్డంగా డిమాండ్లు పెట్టి సర్వేపల్లికి ఓ దండం అని పారిపోయే పరిస్థితి తెచ్చాడు
ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ఉపాధి కల్పన దిశగా పయనిస్తుంటే ప్రతిపక్ష నేతగా సూచనలు ఇవ్వాల్సిందిపోయి సోషల్ మీడియా పోస్టింగులతో గడపడం సిగ్గుచేటు
ఉదయం నుంచి రాత్రి వరకు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకోవడం..వాటిని చూసుకుని నిద్రపోవడం..మళ్లీ కల కనగానే ఇంకో వీడియో పెట్టడం…ఇదే ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి దినచర్య
సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి ఇప్పటి నుంచైనా ఆధారాలు, ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలని హితవు పలుకుతున్నా
ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆహా..ఓహో సర్వేపల్లిలో విజయం తనదే అంటూ ప్రగల్భాలు పలికాడు
చివరకు ఏమైంది. సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి రెండు సార్లు గెలిచిన మెజార్టీ కంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వచ్చిన మెజార్టీయే ఎక్కువ…ఆ విషయం గుర్తుంచుకోవాలని సూచిస్తున్నా
అధికారం పోయిన తెల్లారి నుంచి తన ఇంటి ముందు పోలీసు సైరన్లు లేవని, సెల్యూట్లు లేవని, జనం లేరని, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేటోళ్లు రావడం లేదని బాధపడిపోతున్నాడు
ఈ ఐదేళ్లు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించు.
మీడియా ప్రతినిధులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల సాక్షిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఒక సలహా ఇస్తున్నా
అధికారం ఉన్నా, లేకపోయినా సోమిరెడ్డి ప్రజల మధ్యనే ఉన్నారు
రైతులకు గిట్టుబాటు ధర కోసం, సాగునీటి కోసం పోరాటాలతో గడిపారు
దివంగత నేత జక్కా వెంకయ్యతో పాటు సోమిరెడ్డి ఎప్పుడూ రైతుల పక్షాన నిలుస్తూ వస్తున్నారు
రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గాడిన పెట్టాలని ఎలా చూస్తున్నారో..సర్వేపల్లిని అదేవిధంగా పెట్టేందుకు చంద్రమోహన్ రెడ్డి శ్రమిస్తున్నారు
పురాణాల్లో చెప్పినట్టు లోకహితం కోసం దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు వచ్చి చెడగెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేసేవారు
ఈ రోజు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి పరిస్థితి అదే
ఇకపై సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి విమర్శలను పట్టించుకోవద్దని, అతని మాటలను సీరియస్ గా తీసుకోవద్దని, మనస్సులో నుంచి ఆయన పేరు తీసేయమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కోరుతున్నా
సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డిని ప్రజలు మరిచిపోతున్నారు..ఇందులో ఎలాంటి అనుమానం లేదు..ఆయన పోకడ చూసి జనం నవ్వుకుంటున్నారు
సోమిరెడ్డి కుటుంబం ఏమిటో, వారి వ్యక్తిత్వమేంటో జిల్లా ప్రజలందరికీ తెలుసు
సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి దెబ్బకు పారిపోయిన ఫ్యాక్టరీలను తిరిగి రప్పించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సర్వేపల్లి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని చంద్రమోహనన్నను కోరుతున్నా
