రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి
జగదేవపూర్ : తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణ విప్లవం లో చెరగని ముద్ర వేసుకున్న దొడ్డి కొమరయ్య అని రాష్ట్ర ఎఫ్ డీ సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు.
మండల కేంద్రంలో సోమవారం దొడ్డి కొమురయ్య విగ్రహ ఏర్పాటు కు మండల నాయకులతో కలిసి ప్రతాప్ రెడ్డి భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి,ఎంపీటీసీ ల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్,సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్,స్థానిక సర్పంచ్ లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి,ఎంపీటీసీ ల ఫోరం మండల అధ్యక్షులు కావ్య దర్గయ్య, కో ఆప్షన్ ఎక్బాల్,ఎంపీటీసీ కవిత,మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు నాచారం దేవాలయం డైరెక్టర్ బుద్ధ నాగరాజు,పిర్లపల్లీ సర్పంచ్ యాదవ రెడ్డి,ఉప సర్పంచ్ మల్లేశం, పీఏసీ ఎస్ డైరెక్టర్ భూమయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.




