Breaking News

సాహస వీరుడుని గుర్తించని అధికారులు

53 Views

వాకాడు మండలంలో వినాయక నిమజ్జనం నాడు తన ప్రాణాలను లెక్కచేయకుండా తూపిలిపాలెం బీచ్ నందు ఒక ప్రాణాన్ని కాపాడిన బుర్లవారిపాలెం చందును కనీస అభినందన తెలుపని అధికారులు.
తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ వాకాడు మండలంలో ఆదివారం తూపిలిపాలెం బీచ్ నందు నిమజ్జన సమయంలో అపశృతి చోటు చేసుకున్న ప్రదేశంలో ఇద్దరు యువకులు మరణించగా వేరొక 22 సంవత్సరాల యువకుడిని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చి తన ప్రాణాలను లెక్కచేయకుండా డిగ్రీ చదువుతున్న యువకుడు ఎంబేటి చందు s/o ఎంబెటి. వెంకట రమణయ్య , ఎర్రగాటిపల్లి, బుర్లవారిపాలెం దళితవాడకు చెందిన యువకుడు.వేల మంది వినాయక భక్తులు, డ్యూటీలో ఉన్న రక్షకభటులు వీక్షిస్తూ ఏమీ చేయలేని పరిస్థితులలో మానవత్వాన్ని చాటుకుని ప్రాణాన్ని కాపాడిన విషయం మండలంలోని అందరి అధికారుల దృష్టికి చేరిన విషయం. ఇప్పటివరకు మండలానికి సంబంధించిన పోలీసు వారు కానీ, ఎమ్మార్వో కానీ, ఎంపీడీవో కానీ ప్రజా ప్రతినిధులు కానీ ఆ యువకుడు చేసిన సాహసాన్ని గుర్తించి పై అధికారులకు చేరవేయలేదు. ఇలాంటి విషయాలు చోటు చేసుకున్నప్పుడు ప్రజా యంత్రాంగం గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గ్రామాలలో యువకులు నిరుత్సాహానికి గురవుతారని వాకాడు మండలంలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాహసాన్ని ఒడికట్టుకొని చేసిన ఎంబేటి .చందు ను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అభినందిస్తూ విషయాన్ని సబ్ కలెక్టర్ వారికి, కలెక్టర్ వారికి మరియు ఎస్పి వారికి సమాచారం చేరవేయబోతున్నది.

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్