సిద్దిపేట జిల్లా,తీగుల్:
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్. పిఎసిఎస్ డైరెక్టర్ కామల్ల భూమయ్య. మండల రైతు బంధు మాజీ అధ్యక్షులు బట్టు సుధాకర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ మాజీ కార్యవర్గ సభ్యులు బట్టు దయానంద రెడ్డి అన్నారు.
వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండల పరిధిలోని తీగుల్ గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు, చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ తిరుగుబాటు సమయంలో భారతీయ విప్లవ నాయకురాలు తెలంగాణ ప్రాంతంలోని భూస్వామ్య ప్రభువులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు సమయంలో విస్నూర్ దేశ్‌ముఖ్ అని పిలువబడే జమీందార్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఆమె చేసిన ధిక్కార చర్య చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది అని అన్నారు తెలంగాణ గడ్డపై భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం ఓ మగువా మీరు చూపించిన తెగువ ప్రతి ఆడబిడ్డకు స్ఫూర్తి అన్నారు
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ,నాయకులు వెంకట్ గౌడ్, వెంకట్ రెడ్డి, బిక్షపతి గౌడ్, గ్రామ రాజక సంఘం నాయకులు సీతయ్య, స్వామి, నాగరాజు ,శ్రీకాంత్, సత్తయ్య, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
