విజయవాడ వరద బాధితుల సహాయక చర్యలలో భాగంగా విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీ నందు తన సొంత నిధులు 5 లక్షల రూపాయలతో బాధితులకు గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్
సంధ్యా రాణి దంపతులు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్, సంధ్యారాణి లు మాట్లాడుతూ.
వరదల వలన ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఇక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయనీ
ఇక్కడ ఇళ్లలోకి నీరు వచ్చేసి తినడానికి తిండి లేక ఉండటానికి సరిగా వసతులు లేవు అన్నారు.
సమర్థవంత మైన ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు రాత్రింబవళ్ళు అందరిని అప్రమత్తం చేసుకుంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారికి కావలసిన సదుపాయలు ఏర్పాటు చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ఉన్న అందరి ఎమ్మెల్యే లను వరద ప్రాంతాలలో పర్యటించి వారికి అండగ నిలబడమని ఆదేశించారన్నారు.
సహాయక చర్యలలో భాగంగా ఇక్కడున్న వారికి సరుకులు, దుప్పట్లు అందించడంలో భాగంగా మా వంతు కృషి గా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నా ము అన్నారు.
ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు, ఈశంశెట్టి నటశేఖర్ యువత ప్రణీత్ యాదవ్, ఓం ప్రకాష్,మల్లి కళ్యాణ్, వేముల సునీల్,గుండాల సందీప్,అల్లం సాయి,పాల్గొన్నారు.
