ఒకేచోట కలిసి చదువుకున్న విద్యార్దులందరూ ఎన్నో ఏళ్ళ తరువాత అదేచోట కలిశారు. గూడూరు పట్టణంలోని చర్చివీధిలో ఏర్పాటై ఉన్న జీ.ఎం.యు.పి పాఠశాలలో 1986-87లో ఏడో తరగతి చదివిన పూర్వ విద్యార్దులు కలిశారు..ఎవరెవరు ఎక్కడ ఉన్నారో..వారి స్దితిగతులు, ఉద్యోగాలు,వ్యాపారాలు వంటి వాటిని స్నేహితులు అడిగి తెలుసుకున్నారు.కుటుంబ నేపద్యాలూ తెలుసుకుని ఉల్లాసంగా గడిపారు.దూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా పాఠశాలకు చేరుకుని గత జ్నాపకాలు నెమరేసుకున్నారు.ఉపాద్యాయులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూర్వ విద్యార్దులందరూ కలిసి… విద్యార్దులకు విద్యాసామగ్రి,భోజన ప్లేట్లు,అవసరమైన కుర్చీలు తమ వంతుగా అందచేశారు. అప్పటి ప్రధానోపాద్యాయిని మేరీ శ్యామ సుందరి,ప్రస్తుత ప్రధానోపాద్యాయులు రామచంద్రా రెడ్డి లను వారు ఘనంగా సన్మానించారు.అనంతరం ప్రధానోపాద్యాయులు,ఉపాద్యాయులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్దులు,ఉపాద్యాయులు,విద్యార్దులు పాల్గొన్నారు.
