ఆధ్యాత్మికం

అవాలతో కాళోజీ చిత్రాన్ని చిత్రించిన రామకోటి రామరాజు

52 Views

– తెలుగు భాషా మూల కారకులు కాళోజి
ప్రజాకవి, పద్మవిభూషన్ కాళోజీ 110వ జయంతిని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు చిత్రాన్ని అవాలను ఉపయోగించి అత్యంత అద్భుతంగా చిత్రించి సోమవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుల, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు.

ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ
తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి, తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షలను రగిలించిన ప్రజాకవి కాళోజీ అన్నారు.
అక్షర రూపం దాల్చిన ఓ సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటూ చైతన్యాన్ని చిక్కగా చెప్పిన ప్రజాకవి కాళోజీ అన్నారు.

పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది అన్న కాళోజీ మాటలు మర్చిపోలేనివి ,తెలుగు భాషా దినోత్సవ మూల కారకులు కాళోజి అన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్