కొండపాక మండలం తిప్పారం గ్రామ పరిధిలో గల మల్లన్న సాగర్ నుండి మిషన్ భగీరథకు అందించాల్సిన రా వాటర్ పంప్ హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్. బుధవారం రా వాటర్ పంప్ హౌస్ కలెక్టర్ పరిశీలించారు. మిషన్ భగీరథకు అధికారులు మల్లన్న సాగర్ నుండి వాటర్ పంప్ అయ్యో విధానం, మ్యాప్ ను చుపిస్తు కలెక్టర్ క్లుప్తంగా వివరించారు. పంప్ హౌస్ లోపల కలియ తిరిగారు. మోటార్లను పని చెసె విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 5.6కిలో మీటర్ల దూరంలో మంగోలు శివారులో నిర్మిస్తున్న ఫిల్టర్ వాటర్ బెడ్ ను పరిశీలించారు. వాటర్ ఫిల్టర్ అయ్యో విధానాన్ని మ్యాప్ పాయింట్ గా అదికారులు కలెక్టర్ కి తెలిపారు. రా-వాటర్ పంప్ హౌస్ నుండి ముందుగా పైప్ లైన్ ద్వారా నీరు ఫిల్టర్ అయ్యో దశల వారిగా డిస్ట్రిబ్యూషన్ చానల్, ఎరియేటర్, క్లారిప్లాక్ రెటర్, ఫిల్టర్ బెడ్ లో వాటర్ శుద్ది అయిన తర్వాత క్లియర్ వాటర్ రిజర్వాయర్ లోకి నీరు వేళ్తాయని అధికారులు కలెక్టర్ కి తెలిపారు. మొత్తం చుట్టూ కలియ తిరుగుతు నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని మొత్తం పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయ్యాలని నిర్మాణా ఏజెన్సీ అదికారులను ఆదేశించారు. అటవీ భూమికి సంబందించిన అనుమతులు త్వరగా పూర్తి చేయ్యాలని డిఎప్ఓ కి తెలిపారు.
కలెక్టర్ వెంట డిఎప్ఓ శ్రీనివాస్, మిషన్ భగీరథ అధికారులు సిఈ విజయ్ ప్రకాశ్, ఎస్ ఈ శ్రీనివాస్ చారి, ఈఈ రాజయ్య, డిఈ నాగార్జున రావు, తహసిల్దార్, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.




