ఎల్లారెడ్డిపేట నవంబర్ 23 :ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామాని కి చెందిన అందె నడిపెల్లి పోచయ్య ను ( 70 ) బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఓమిని వ్యాన్ ఢీ కొట్టింది ఈ సంఘటనలో పోచయ్య తల పగిలి రక్తస్రావం కావడంతో వెంటనే సమీపంలోని. హెచ్ పి పెట్రోల్ బంకు సిబ్బంది ఆయనను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రవేట్ హాస్పిటల్ కు తరలిస్తుండగా ఆయన మరణించాడు ,
హెచ్ బి పెట్రోల్ బంకులో స్వీపర్ గా పనిచేసే పోచయ్య టీ తాగడానికి బంక్ కు ఎదురుగా ఉన్న టీ కొట్టు లో టీ తాగుతుండగా ఎల్లారెడ్డిపేట నుండి గొల్లపల్లి వైపు అతివేగంగా వెలుతూ ఢీకొట్టాడు,
ఈ సంఘటనలో పోచయ్య తీవ్రంగా గాయపడి తీవ్ర రక్తస్రావనం కావడంతో సమీపంలోని పెట్రోల్ బంక్ సిబ్బంది మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆయన మరణించారు,
ఆయనకు భార్య నర్సవ్వ , కుమారుడు బాలయ్య ఉన్నారు,
ఓమిని వ్యాన్ డ్రైవర్ రాజన్నపేట గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు నారోజు రామస్వామి గా గుర్తించినట్లు తప్ప తాగి వచ్చి అతివేగంగా అజాగ్రత్తగా నడిపి పోచయ్య మృతికి కారకుడయ్యాడని అతని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆరోపించారు , ఎస్సై శేఖర్ కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు, శవాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలోని పోస్టుమార్టంకు తరలించారు ,
పోచయ్య మృతికి కారకుడైన డ్రైవర్ నారోజు రామస్వామి ఓమిని వ్యానుతో పాటు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు,
