Breaking News

ఎస్సీ ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల నిరసన..

134 Views

(తిమ్మాపూర్ సెప్టెంబర్ 03)

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ విద్యుత్తు ఉద్యోగుల సంఘం జేఏసీ పిలుపుమేరకు మంగళవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అలుగునూర్ లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా కరీంనగర్ రూరల్ డివిజన్ సెక్రటరీ ఇల్లందుల రత్నం మాట్లాడుతూ వివాదాస్పదమైన ఆర్డర్లను రద్దు చేస్తూ, కాన్ సీక్వెన్షియల్ సీనియారిటీని కొనసాగించాలన్నారు. అర్టిజెన్ల డిమాండ్స్ కన్వర్షన్స్, ఏపీ ఎస్ ఈ బి సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సింహచలం, లైన్ ఇన్స్పెక్టర్ చంద్రయ్య, లైన్ మెన్,ఏఎల్ఎం లు,శివోన్, శ్రీనివాసు, జేఎల్ఎం, రాజు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found