Breaking News

సైదాపురంలో పిచ్చి కుక్క స్వైర విహారం

63 Views

*సైదాపురం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం*

*చిన్న పెద్ద తేడా లేకుండా14 మందిని గాయపరిచిన పిచ్చికుక్క*

*నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన సైదాపురంలో సోమవారం నాడు, ఓ పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. సైదాపురం పంచాయతీ లో, చిన్నా పెద్దా తేడాలేకుండా మొత్తం 14 మందిని గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు.సోమవారం ఉదయం నుంచి, మధ్యాహ్నం లోపు, మొత్తం 14 మందిని గాయపరిచిందని, దారిన వెళుతున్న వారిని, ఆడుకుంటున్న చిన్నారులను, గాయపరిచిందని, ఇంకా ఎంతమందిని గాయపరిస్తుందో అర్థం కావడం లేదని, స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. స్థానికులు కర్రలు చేతపట్టి, పిచ్చికుక్కని వధించేందుకు వెంటపడ్డారు.ఈ విషయమై మండల అధికారులకు, సమాచారం అందించామని స్థానికులు తెలిపారు. ఈ పిచ్చి కుక్కని వీలైనంతవరకు పంచాయతీ అధికారులు పట్టుకొని, మరికొంతమంది ఈ పిచ్చికుక్క బారిన పడకుండా ఉండేలా, త్వరగా చర్యలు తీసుకోవాలని, స్థానికులు కోరుకుంటున్నారు*
*????శ్రీచక్ర తెలుగు దినపత్రిక నెల్లూరు,తిరుపతి జిల్లాల బ్యూరో..కృష్ణ మోహన్*

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్