భూ సమస్యలు పరిష్కరించాలంటూ గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం బీఎస్పీ నాయకులు ఆందోళన చేపట్టారు. బాలాయపల్లి మండలంలో పేదలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతమై ఉన్నాయని వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని బిఎస్పీ నేత నాసిన భాస్కర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఆర్డీవో ని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు శ్రీనివాసరాజు, వెంకయ్య రైతులు పాల్గొన్నారు.





