సెప్టెంబర్ 11 కుత్బుల్లాపూర్
ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని కలిసిన జయరాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జయరాం నగర్ లో, జయరాం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ నీ వారి నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం వారు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి ఎల్లపుడు ముందుంటానని, కాలనీలో నెలకొన్న ఎటువంటి సమస్యలున్న తన దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించడానికి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడ్వైసర్ ఎం.అజయ్ కుమార్, అధ్యక్షులు కుంట మల్లేష్, వైస్ ప్రెసిడెంట్ లింగ బిక్షపతి, జనరల్ సెక్రటరీ ఎం.హరినాథ్ , కోశాధికారి ఆర్.రాములు, టెంపుల్ చైర్మన్ నర్సింహా, ప్రెసిడెంట్ పెద్ది రాజు, జనరల్ సెక్రటరీ నరేష్, వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్, యూత్ అద్యేక్షులు పాల్, కమిట మెంబెర్స్ కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
