Breaking News

కోటలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

52 Views

కోటలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కోట మండల అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు.కోట మండల క్రాస్ రోడ్డు నందుగల వై ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కోట మండల పార్టీ నాయకులు వైస్సార్ అభిమానులు వైసీపీ కార్యకర్తలు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మండలపార్టీ అధ్యక్షుడు సంపత్ కుమార్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి గొప్పతనం గూర్చి అయన పేదవారికి ప్రవేశపెట్టిన పధకాలు 108,ఆరోగ్యశ్రీ, ఫీజు రియంభార్స్మెంట్, రైతులకు చేసిన మంచి గూర్చి చెప్పి అయనతనయుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా గొప్పగా పాలించాడని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాదర్తి రాధాకృష్ణ రెడ్డి, మొబీన్ భాషా, చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డి,శశిధర్ రెడ్డి, విజయసారధి రెడ్డి,నాయకులు వైస్సార్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్