Breaking News

ఓజిలిలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

65 Views

_*????తెలుగు ప్రజల గుండె చప్పుడు డాక్టర్ వైయస్సార్..!!*_

_*????ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ బతికే ఉన్నారు..!!*_

_*????ఓజిలి మండలం కన్వీనర్ పాదర్తి హరినాథ్ రెడ్డి..!!*_

_*????ఓజిలిలో ఘనంగా వైఎస్ ఆర్ 15వ వర్ధంతి వేడుకలు..!!*_

_*????దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో ఇప్పటికీ బ్రతికే ఉన్నా రని,వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు ఇప్పటికీ మర్చిపో లేదని ఓజిలి మండలం కన్వీనర్ పాదర్తి హరి నాథ్ రెడ్డి అన్నారు.సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 15వ వర్ధంతి వేడుక లు మండల కేంద్రమై న ఓజిలలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ముందుగా వైయస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఇవ్వాల్టి వరకు తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్ బ్రతికే ఉన్నారని వైఎస్సార్ పథకాలు ప్రజలు మరిచిపోలేదన్నారు. ఇరురాష్ట్రాల ప్రజల గుండెల్లో ఆయన ఇంకా బతికే ఉన్నార న్నారు.వైఎస్సార్ ది మంచి మనసు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడమే ఆయన లక్ష్యమన్నారు.ప్రతి పేద వాడిని ధనికు డు చేయాలన్న సంకల్పం వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ గాని ఇల్లు లేని వారు అంటూ లేకుం డా చేసేందుకు లక్షల ఇళ్లను కట్టించిన ఘనత వైయస్ రాజ శేఖర్ రెడ్డిది అన్నారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు ప్రతి ఇంటికి చేరాయి అన్నారు. రైతు సంక్షేమం కోసం 9 గంటల ఉచిత విద్యుత్తును ఇచ్చిన ఘనత, రైతులకు డ్రిప్పు పరికరాలు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కిందన్నారు. వైఎస్సార్ రైతు పక్షపాతి అన్నారురైతులకు ఉచిత విద్యుత్తు ఇచ్చి రైతుల పట్ల తనకున్న ప్రేమ ఏంటో చూపించాడుఅన్నారు. రుణ మాఫీ చేసి రైతులను రుణ విము క్తులను చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇరు రాష్ట్రాలలో 46 లక్షల పక్కా ఇండ్లు కట్టించి సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖర్ రెడ్డి అన్నారు. కులాలకు,ప్రాంతా లకు అతీతంగా అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసిన గొప్ప మనసున్న మనిషి వైఎస్ రాజ శేఖర్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ లేని లోటు ఎన్నటికీ తీరనిదని అన్నారు.ఈ కార్య క్రమంలో ఎంపీపీ గడ్డం అరుణ రెడ్డి,వైస్ ఎంపీపీ లెక్కల ప్రసాద్ నాయు డు,మహిళా అధ్యక్షురాలు పాక నాటి ప్రవీణ ఎంపీటీసీ రఘు రామరాజు,వైసీపీ నాయకులు దేశిరెడ్డి మధుసూదన్ రెడ్డి, ఉచ్చూరు హరినాథ్ రెడ్డి, కొండూరు దామోదర్ రాజు, జరుగు మల్లి బాబురెడ్డి, వెంకట సుబ్బ రాజు,మండల కో ఆప్షన్ సభ్యులు షేక్.ఖాదర్ భాష సర్పంచులు ఎల్లా సురేష్ రెడ్డి, మహేంద్ర రెడ్డి,కొండూరు ప్రభాకర్ రాజు గోవిందు పోలయ్య, సుబ్బా నాయుడు,ఎద్దు పెంచలయ్య, రామయ్య,ప్రసాద్,సురేష్,కుమార్ నాయుడు ఆజ్మతుల్లా,రాజా రెడ్డి,వేణురెడ్డి,రవి,తదితరులు పాల్గొన్నారు.*_

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్