-కాంగ్రెస్ పార్టి జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి
(తిమ్మాపూర్ సెప్టెంబర్ 01)
రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సమాచారం మేరకు కరీంనగర్ జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి
ఒక ప్రకటనలో తెలిపారు.వాతావరణశాఖ కరీంనగర్ జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాలో ఉన్న ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
వరద ప్రభావిత ప్రాంతాలలో వరదల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల చెరువుల మత్తడిల వద్ద పరిస్థితి అంచనా వేసుకోవాలని కోరారు.
రైతులు వర్షాలు తగ్గేంతవరకు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లవద్దని, చిన్న పిల్లలు విద్యుత్ స్తంభాలను ముట్టుకోకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..