ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా గూడూరు నియోజకవర్గం శ్రీనివాస సత్రం సముద్రతీరంలో లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి,ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఆదివారం సైకతశిల్పి మంచాల సనత్ కుమార్ పవన్ కళ్యాణ్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా నెల్లూరు నగర అధ్యక్షులు అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చింతలూరు సుందర్ రామిరెడ్డి గారు పాల్గొని ఇంతటి గొప్ప శిల్పని రూపొందించిన శిల్పిని అభినందించి శాలువతో ఘనంగా సన్మానించారు వారితో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజికవర్గ పీఓసి మోహన్ మరియు నియోజికవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు .
