జాతీయ స్థాయి క్రీడలో గెలుపొందిన తాడూరి అశ్రుత కు సన్మానం
గజ్వేల్ నియోజకవర్గం ,ఆగస్టు 30
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన తాడూరి వెంకటేష్, పావని దంపతుల కుమార్తె తాడూరి అశ్రుత, జాతీయస్థాయి క్రీడాలో గెలుపొందిన సందర్భంగా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని జె హెచ్ ఆర్ మదర్స్ హైస్కూల్లో జాతీయస్థాయి క్రీడలో పాల్గొన్న తాడూరి అశ్రుత కు క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ ఏం ఎన్ ఎస్. కే. హైదర్ పటేల్ సన్మానించడం జరిగింది.
