జగదేవపూర్ , ఆగస్టు 29
సిద్దిపేట జిల్లా ,జగదేవపూర్ నుంచి గొల్లపల్లి శివారులో 28 వ తేదీన ఉదయం 10: 30 నిమిషాలకు గంజాయి నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. గురువారం జగదేవపూర్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపి ఆదేశాలతో ఏసిపి పర్యవేక్షణాల్లో రూరల్ సిఐ మహేందర్ రెడ్డి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ గారికి గంజాయి అమ్ముతున్నారని వచ్చిన సమాచారం మేరకు
గంజాయి అమ్ముతున్న మరియు సేవిస్తున్న నిందితులను అరెస్టు చేసిన జగదేవపూర్ పోలీసులు
3.323 కేజీల గంజాయి స్వాధీనం
నిందితుల వివరాలు
1 కోహెడ వెంకటేష్ తండ్రి వైకుంఠం, వయసు 24 సంవత్సరాలు, నివాసం బాలాజీ నగర్, కాప్రా మండలం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.
2 సోడే జస్వంత్ @ బన్నీ తండ్రి కుమారస్వామి వయస్సు 20 సంవత్సరములు, నివాసం బాలాజీ నగర్, కాప్రా మండలం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.
3 కొమిరి ప్రేమ్ రాజ్ తండ్రి మల్లయ్య, వయసు 29 సంవత్సరాలు, నివాసం పోతారెడ్డిపల్లి, చేర్యాల మండలం.
4 మామిడాల అరవింద్ తండ్రి మల్లేశం వయసు 29 సంవత్సరాలు, నివాసం పోతారెడ్డిపల్లి, చేర్యాల మండలం.
5 పోసానిపల్లి బాలకృష్ణ తండ్రి కనకయ్య, వయస్సు 20 సంవత్సరములు, నివాసం తిమ్మాపూర్, జగదేవపూర్ మండలం.
6 బంగి సంపత్ తండ్రి కనకయ్య, వయస్సు 20 సంవత్సరములు, నివాసం చాట్లపల్లి, మండలం జగదేవాపూర్,
7 పల్లెపాటి వెంకటేష్ తండ్రి కొండయ్య, వయస్సు 35 సంవత్సరములు, నివాసం మునిగడప, మండలం జగదేవపూర్.
కేసు యొక్క వివరాలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి తెలియపరుస్తూ జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బందితో కలిసి తేదీ: 28-08-2024 10:30 గంటల సమయమున గొల్లపల్లి గ్రామ శివారులోని AMR కెనాల్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా అదే సమయం లో జగదేవ్పూర్ వైపు నుండి చేర్యాల వైపు రెండు పల్సర్ మోటార్ సైకిల్ లు 1. TS28-M-2790 2. TS08JP-6611 వచ్చుచున్నవి. వాటిని పొలిసు వారు ఆపే ప్రయత్నం చేయగా వారు తప్పించుకోడానికి ప్రయత్నించగా, పోలిసు వారు వారిని చాకచక్యంగా పట్టుకొని తగు రీతిలో వారిని విచారించగా, వారి వద్ద గంజాయి ఉంది అని, దానిని తమ స్నేహితులకు అమ్మడానికి పోతిరేడ్డిపల్లీ గ్రామంలో ని ప్రేమ రాజ్ ఇంటికి వెళ్తున్నామని చెప్పగా, పొలిసు వారు మొదటి వ్యక్తి అయిన వెంకటేష్ TS28-M-2790 యోక్క బైక్ లో తనిఖి చేయగా అందులో 1 kg 300 గ్రాములు, మరియు రెండవ వ్యక్తి అయిన బన్ని @ జస్వంత్ బైక్ TS08JP-6611 నందు తనిఖి చేయగా అందులో 1 KG 0.23 గ్రాములు గంజాయి దొరికింది, ఇట్టి గంజాయి గత నెల 20-07-2024 నాడు భద్రచలం వెళ్లి, అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద 15000 రూపాయలకు 5kg ల గంజాయి కొనుగోలు చేశాం అని, వచ్చే దారిలో బస్సులో వస్తే గంజాయి ఎవరికైనా కనిపిస్తుంది అని పీనపాక పట్టి నగర్ వద్ద ఫంక్షన్ హాల్ ముందు గల బజాజ్ పల్సర్ బైక్ TS28-M-2790 ని దొంగతనం చేసి, దానిపై బాలాజీ నగర్ లోని వారిఇంటికి వచ్చారని, అప్పటినుండి అందులో నుండి కొంచం గంజాయి తాగుతూ దొంగిలించిన బండిని వాడుకుంటున్నారు. గత 20 రోజులకింద వారికి పరిచయం ఉన్న ప్రేమ రాజ్ మరియు అరవింద్ లకు 2 kg గంజాయిని 24 వెయ్యిలకు అమ్మిఅనారని, వారు నిన్న ఫోన్ చేసి మల్లి గంజాయి కావాలని అడగడంతో ఈ రోజు తమ వద్ద ఉన్న గంజాయిని తీసుకొని వెళ్తున్నామని, చెప్పగా, తర్వాత పొలిసు వారు, వెంకటేష్, బన్ని లను తీసుకొని పోతిరెడ్డిపల్లి లోని ప్రేమ రాజ్ ఇంటికి మద్యానం 2 గంటలకి వెళ్ళగా అట్టి సమయంలో అక్కడ ప్రేమ రాజ్, అరవింద్, మారియు గంజాయి కోసం అక్కడికి వచ్చిన బాలకిషన్ సంపత్, వెంకటేష్ లు 200 ML గల THUMSUP బాటిల్, సెల్లో ఫైన్ గ్రిప్ యొక్క బుర్ర సాయంతో గంజాయి తాగుతూ ఉన్నారు, పొలిసు వారిని చూసి వారు పారిపోయే ప్రయత్నం చేయగా, పొలిసు వారు పట్టుకొని వారిని విచారంచగా, వారు గంజాయి తాగుతున్నాం అని ఒప్పుకున్నారు. తదుపరి విచారించాగా గతం లో ప్రేమ రాజ్ అరవింద్ లు వెంకటేష్ మరియు బన్ని నుండి 2 kg గంజాయి 24 వేయిలకు కొనుగోలు చేసి వారు తాగుతూ, మిగిలినది బాలకిషన్, సంపత్, వెంకట్జి, మనోజ్ లకు అమ్మినామని తెలిపినారు. అదే విధంగా గతంలో తన స్నేహితుడు అయిన తేజ నెంబర్ ప్లేట్ లేని హీరో హోండా passion ప్రో బైక్ ENGINE NO. HA10ACJHF71066, CHASSIS NO. MBLHAR183JHF36598 ని ఎక్కడో దొంగతనం చేసి తనకు ఇచ్చి వాడుకోమ్మని చెప్పినారని చెప్పగా పొలిసు వారు అట్టి బైక్ ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ప్రేమ రాజ్ ఇంట్లో వెతకాగా 1 kg గంజయి దొరకగా దానిని పొలిసు వారు సీజ్ చేయడం జరిగింది. తర్వాత బింగి సంపత్, వెంకటేష్ ల వద్ద నుండి గంజాయి కొనడానికి తెచిన 2 వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింధీ, ప్రేమ రాజ్, అరవింద్, వెంకటేష్ ల సెల్ ఫోన్ లు సీజ్ చేయడం జరిగింది.
*మొత్తంగా 3.323 kg ల గంజాయి, ( from A-1, A-2, A-3 and A-4)*
*(6) సెల్ ఫోన్ లు, 2 వేల రూపాయల నగదు సీజ్ చేసి నిందితులని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు.*
*(4) మోటార్ సైకిల్ లు (ఇందులో రెండు దొంగతనం చేసినవి),*
1. TS-28-M-2790 Bajaj Pulsar
2. TS-08-JP-6611 Bajaj Pulsar
3. passion pro motor cycle without number,
4. TG-36-6549 YAMAHA R15
ఈ సందర్భంగా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామాలలో మరియు హోటళ్లల్లో కళ్ళు డిపోల వద్ద ఇతర ప్రదేశాలలో ఎవరైనా గంజాయి అమ్ముతున్నట్లుగాని కలిగి ఉన్నారని సమాచారం ఉంటే వెంటనే డయల్ 100,లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళుతున్నారు వారి కదలికలపై ఒక కన్నేసి ఉంచాలని తెలిపారు. గ్రామాలలో మరే ఇతర ప్రదేశాలలోనైనా గంజాయి కలిగి ఉన్న మరియు విక్రయించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి సేవించినారని అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని నార్కోటిక్స్ కిట్స్ ద్వారా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. గంజాయి రహిత జిల్లా గురించి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. గంజాయి కేసు చేదించడంలో కీలక పాత్ర వహించిన జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్,మరియు పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డ్ గురించి సిపి మేడమ్ గారికి ప్రపోజల్ పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
