పి.ఏ.సి.ఏస్ డైరెక్టర్ కామల్ల భూమయ్య
జగదేవపూర్ , ఆగస్టు 29
సీఎం సహా నిధి పేదలకు వరం అని పిఎసిఎస్ డైరెక్టర్ కామల్ల భూమయ్య అన్నారు. మండల పరిధిలోని తిగుల్ గ్రామానికి చెందిన బొర్రోళ్ల సంతోష్ కుమారుడు హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు హాస్పిటల్ లో చికిత్స పొందారు. మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ శాసన సభ్యులు కేసీఆర్ మాజీ రాష్ట్ర ఎఫ్ డీ సీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సహకారంతో సిఎం సహాయనిదికి దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ నిధుల నుండి మంజూరు చేసిన రూ39000/- వేల చెక్కును ప్యాక్స్ డైరెక్టర్ కామల్ల భూమయ్య టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ,నాగేల్లి శ్రీనివాస్ రెడ్డి మాజి ఎంపీటీసీ, గర్నేపల్లి కోటయ్యతో లబ్ధిదారునికి అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సహాయనిధి పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది పేద ప్రజలకు ఉపయోగపడిందని అన్నారు. ఈ ప్రభుత్వంలో పేద ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు దగ్గు సత్తయ్య, ఐలయ్య ,అయ్యాలం, మల్లేశం పాల్గొన్నారు.
