ముస్తాబాద్, ఆగస్టు 28, (24/7న్యూస్ ప్రతినిది): కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్వయంప్రాతిపత్తిగల స్వతంత్ర దర్యాప్తు సంస్థలను ఈడి, సిబీఐలను తమ గుప్పెట్లో పెట్టుకొని గతమార్చిలో మద్యం అక్రమ కేసులో కల్వకుంట్ల కవితక్కను అరెస్ట్ చేసి 166 రోజులు జైలులో వేధించి, ఎంత ఒత్తిడి చేసిన భయపడకుండా నిలిచిన ధైర్యాశాలి, తెలంగాణ ఫులిబిడ్డ కవితక్కకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో బీజేపీ కుట్ర చేసినప్పటికీ ఎన్ని రోజులైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని సుప్రీంకోర్టు ఈడి సీబీఐలకు చివాట్లు పెట్టిన విధానం చూస్తే ప్రజలందరికీ అర్థమవుతుందని. అలాగే న్యాయ వ్యవస్థపై అవగాహన లేని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అత్యున్నతమైన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టి మాట్లాడడం వారి అవగాహన లేని తనానికి నిదర్శమని, అలా మాట్లాడటం న్యాయ వ్యవస్థను అగౌరవ పరుస్తున్నట్లేనని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెంగని మనోహర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి, చిప్పలపల్లి మాజీ సర్పంచ్ తాడెపు ఎల్లం, సీనియర్ నాయకులు తాళ్ళ రాజు
, సుంచు గణేష్, రాజేశం పాల్గొన్నారు.




