మంచిర్యాల జిల్లా:
మందమర్రి మున్సిపాలిటీ లోని సింగరేణి CER క్లబ్ లో 136 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు
*వివేక్ సర్ కామెంట్స్*
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చాం
ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీ చేశాం.
రాష్ట్రం లో ప్రజాపాలన కొనసాగుతుంది.
మందమర్రి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను.
డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని నా దృష్టికి రావడంతో రెండు కోట్లు శాంక్షన్ చేయించాను.
రోడ్లకు 80 లక్షల తో అభివృద్ధి పనులు ప్రారంభించాం.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతోంది అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లు అందేలా కృషి చేస్తాం.
భూ దందాలు చేస్తే సహించేది లేదు.
చట్టం ప్రకారం అధికారులు విధులు నిర్వహించాలి… దండాలు చేసే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.
మంచి నీటి ఇబ్బందులు ఉండద్దు.. ఏమైనా నిధులు అవసరం ఉంటే వెంటనే కేటాయిస్తానని మున్సిపల్ కమిషనర్ కు సూచన.
మందమర్రి మున్సిపాలిటీలో 20 లక్షల విలువ గల రెండు ట్రాక్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే.





