మానవ సంబంధాలలో ఒకే తల్లికి పుట్టిన ఇరువురి వ్యక్తుల పవిత్రమైన బంధంమే రక్షబంధన్ . గ్రామాలలో ఉదయం నుండే షాపులలో రాఖీలను జోరుగా అమ్మకాలు జరిగాయి. ఇల్లులు శుభ్రం చేసుకుంటారు. ఆడపడుచులు వచ్చి అక్కలు తమ్ముళ్ళకి, చెల్లెలు అన్నలకు రాఖీలు కట్టడం జరిగింది. రాఖీలు కట్టుకొని ఒకరికొకరు సీట్లు తినిపించుకోవడం జరుగుతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు వర్షం సైతం లెక్కచేయకుండా రాఖీలు కట్టడం మాత్రం ఆగడం లేదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ అభిమానాలు చూపిస్తూ, ఈ జన్మలో కాకుండా ఏ జన్మలోనైనా మళ్లీ ఇలాగే పుట్టాలని, ఇలాంటి ప్రేమ అభిమానాలు, ఆప్యాయతలు చూపించాలని కోరుకోవడం జరిగింది.




