*రామగుండం పోలీస్ కమీషనరేట్*
*సోదరభావానికి ప్రతీక రక్షా బంధన్.
*కమీషనరేట్ లో రాఖీ పండుగ వేడుకలు*
రాఖి పండుగ సందర్బంగా ప్రజాపిత బ్రమ్మ కుమారిస్ ఇష్వారియ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో రామగుండము పోలీస్ కమీషనరేట్ లో పోలీస్ వారికీ రాఖి కట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) కి బ్రమ్మకుమారి పద్మగారు రాఖీ కట్టారు. బ్రమ్మ కుమారి పద్మ గారు మాట్లాడుతూ.. అనురాగం, అనుబంధాలకు ప్రతీక రక్షాబంధన్ అనురాగం..ఆప్యాయత..అనుబంధాలను పంచేదే రాఖీ పండుగ అని ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలూ పనిచేసే పోలీసుల, వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించాలని పేర్కొన్నారు. జ్ఞానం, పవిత్రత, శాంతి, ప్రేమ, సంతోషాలతో మనుషులు జీవించాలన్నారు.
సిపి మాట్లాడుతూ … సోదరీసోదరుల అనుబంధానికి గుర్తు రక్షాబంధన్ అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా రామగుండం కమిషనర్ కు వచ్చి సమాజంలోని అన్ని అందరికీ రక్షణ కల్పించే పోలీసు వారికి దైవ శక్తి రక్షణ ఉండాలని పోలీస్ వారి గురించి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన అందరికి రాఖీలు కట్టిన బ్రహ్మకుమారిలకు సిపి గారు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు దామోదర్, కన్న మధు , మల్లేషం, శ్రీనివాస్, బ్రహ్మకుమారీలు కీర్తి, సరోజన ,హరీష్ లు పాల్గొన్నారు లు హాజరయ్యారు.





