*స్వతంత్ర దినోత్సవాన్ని పండుగలాగా జరుపుకోవాలి – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి *
హార్ ఘర్ తిరంగ ర్యాలీ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచన మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో బీజేపీ యువ మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా బైక్ ర్యాలీ లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, యువకులు పెద్ద ఎత్తున జాతీయ జెండాలతో పాల్గొని ఐ బి చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, రైల్వే స్టేషన్, ముఖరమ్ చౌరస్తా, శ్రీనివాస్ టాకీస్ మీదుగా ఓవర్ బ్రిడ్జి శిశు మందిర్ పాఠశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవాన్ని ఒక్క పండుగలాగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సూచన మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో తీరంగా ర్యాలీలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడి అమరులు అయిన వారిని స్మరించుకుంటు వారికి ఘన నివాళి అర్పిస్తున్నాము అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పై జాతీయ జెండా ఎగురవేయలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బోలిశెట్టి అశ్విన్, గొలి రాము, అమీరిషేట్టి రాజు, పల్లి రాకేష్, బింగి ప్రవీణ్, జోగుల శ్రీదేవి, రెడ్డిమల్ల అశోక్, అరెందుల శ్రీనివాస్, సుజిత్, తిరుమల, చిరంజీవి, అర్నకొండ శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.





