విద్యాభివృద్ధికి నూతన దిశ చూపుతున్న అంగడి కిష్టాపూర్ పాఠశాల ఉపాధ్యాయులు – జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి
సిద్దిపేట జిల్లా, తెలుగు న్యూస్ 24/7
మర్కుక్ మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, అంగడికిష్టాపూర్‌లో ప్రీ–ప్రైమరీ స్టాల్, నూతన లైబ్రరీ మెగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలకిషన్ అధ్యక్షతన ఘనంగా ఏర్పాటుచేశారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాధికారి వెంకట రాములు, హాజరయ్యారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై నిబద్ధత స్పష్టంగా కనిపించిందనీ ప్రీ–ప్రైమరీ స్టాల్ ప్రారంభం చిన్నారుల విద్యకు బలమైన పునాది వేయడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.చిన్న వయసులోనే పిల్లలకు ఆటలతో కూడిన అభ్యాసం అందించడం ద్వారా మేధస్సు, సృజనాత్మకత, సామాజిక నైపుణ్యాలు మెరుగుపడతాయనీ. అలాగే నూతనంగా ప్రారంభించిన లైబ్రరీ విద్యార్థుల్లో పఠనాభిరుచి పెంపొందించి, జ్ఞానవిస్తరణకు దోహదపడుతుందన్నారు.పుస్తకాలతో మమేకమయ్యే అలవాటు విద్యార్థులను భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతుందనీ అభిప్రాయపడ్డారు.అదేవిధంగా మేఘా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ద్వారా పిల్లలకు పోషకాహారం ప్రాధాన్యతను తెలియజేయడంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించడం ఉపాధ్యాయల పని తీరుకు నిదర్శనగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమాలు విద్యను కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, జీవన నైపుణ్యాలతో ముడిపెట్టేలా రూపుదిద్దుకున్నాయనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులను,జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాధికారి వెంకట రాములు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొండల్ రెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శంకర్ రెడ్డి ఉప సర్పంచ్ సురేశ్ గౌడ్ మాజీ ఎంపీటీసీ నరేందర్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు.





