ప్రాంతీయం

కాంగ్రెస్ నాయకులు బుర్రరాములుగౌడ్ ఇకలేరు…

189 Views

ముస్తాబాద్, ఆగస్టు 10 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములుగౌడ్ ఇటీవల కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస వదిలారు.ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి వారి నివాసానికి చేరుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా అలుపెరుగని నాయకుడిగా పార్టీకి ఎనలేని సేవలు అదించి ఆయన ఇక లేరు అని మరణవార్త కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోని విధంగా కల్చివేసింది. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుని పలువురిని కంటతడి పెట్టించింది. పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ ఆయాంలో హౌస్ అరెస్టులు చేసిన పోలీస్ స్టేషన్లలో నాడు భయపడని నాయకుడు బుర్ర రాములుగౌడ్ నేడు అధికారం మాదేనని చెప్పడానికి నోచుకోక పోవడం పార్టీ నాయకులను మరింత కుంగతీసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్