ప్రాంతీయం

పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి

85 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్

తేది 21-10-2023

పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి.

అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం.

పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, కుటుంబ సభ్యులకు పరామర్శ

పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ ప్రారంభం

ఈరోజు రామగుండం కమిషనరేట్ రామగుండం కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజీ) గారు పోలిస్ గౌరవందనం తీసుకుని, వివిధ సంఘటనలో ఉగ్రవాదులచే అసాంఘిక శక్తులచే పోరాడి అసువులు బాసిన అమరవీరుల పేర్లను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ఈ సంవత్సరం అసువులు బాసిన 189 మంది పేర్లను గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్ రావు గారు చదివారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛము ఉంచి సీపీ మేడం గారు, అధికారులు మరియు సిబ్బంది నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా సీపీ గారు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగలు మరువలేనివని, దేశ వ్యాప్తంగా విధి నిర్వహణ లో 189 మంది తమ అమూల్య ప్రాణాలను త్యాగం చేసిన పోలీసులను స్మరిస్తూ అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది. అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించుకోవడం జరిగిందన్నారు. పోలీసు అమరవీరుల వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాము కుటుంబాల సంక్షేమాన్ని మరియు వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను సర్వస్వం లభింపచేయడం, వారి పిల్లలకు ఎడ్యుకేషన్ మరియు ఉద్యోగ పరంగా సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క సమయంలో వారికి అండగా ఉంటామన్నారు. ప్రజల, దేశ రక్షణలో ప్రాణం కoటే విధి నిర్వహణ గొప్పదని చాటిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు.

త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు వారి యొక్క సమస్యలను అడిగి వారు చెప్పిన సమస్యలను సాద్యమైనoత తొందరగా పరిష్కరిస్తాం అని అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం అని ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చు. సంస్మరణ దినోత్సవం రోజున మృతి చెందిన పోలీసు కుటుంబాల సభ్యులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు.

పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్ ప్రారంభం

పోలీస్ అమరవీరుల దినోత్సవం(ఫ్లాగ్ డే) సందర్భంగా పోలీస్ కమిషనరేట్ ఆవరణలో అధికారులు మరియు సిబ్బంది కొరకు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ గారు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ వెల్పర్ క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. క్యాంటీన్‌లో టీ మరియు స్నాక్స్ అందించబడతాయి. ఇది కాకుండా, సిబ్బంది అవసరాలకు అనుగుణంగా అల్పాహారం, మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం కూడా అందించబడుతుంది అన్నారు.

కార్యక్రమం లో గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్ రావు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, సైబర్ క్రైమ్ ఏసీపీ రాజేష్, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ ఏఆర్ మల్లికార్జున్, ఇన్స్పెక్టర్స్, సబ్ఇన్స్పెక్టర్స్, రిజర్వడ్ ఇన్స్పెక్టర్స్, రామగుండము పోలీస్ కమిషనరేట్ పోలీస్ సంఘం అద్యక్షులు బోర్లకుంట పోచలింగం , ఎఒ నాగమణి , సిసి మనోజ్ కుమార్, ఎఆర్ , సివిల్ పోలీసు సిబ్బంది మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *