ముస్తాబాద్, ఆగస్టు10 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత రాష్ట్రసమితి విద్యార్థి విభాగం రాష్ట్రనాయకులు కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా మెట్ పల్లి పెద్దాపూర్ గురుకులంలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు అనుమానస్పదంగా మరణించారు. విద్యార్థులు అస్వస్థకు ఎలా గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా గురుకులాలు వసతి గృహాలపైన పట్టించుకున్న పాపాన పోలేదని విద్యాశాఖ మంత్రి లేకపోవడం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం వలన ఈ 15 రోజుల వ్యవధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు విద్యార్థులు మరణించడం చాలా బాధాకరమని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మర్రిమడ్లకు చెందిన ఆరవ తరగతి చదువుతున్న ఎడ్యుల అనిరుద్ అనుమానాస్పదంగా మరణించడం జరిగిందని. ఒక్కగానొక్క బిడ్డ మరణించడంపట్ల వారి తల్లి తీవ్ర శోకసంద్రంలో మునిగారని. ఇన్ని అనుమానాస్పద మరణాలు జరుగుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దీనికి కారణమైన అధికారులను విధుల నుండి సస్పెండ్ చేయకుండా వారి ఉద్యోగాలను తొలగించాలని వారి మరణాల కారణమైన వారి నీ కఠినంగా శిక్షించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. వసతి గృహాల్లో సరియైన మౌలిక సదుపాయాలు లేక అధికారుల అలసత్వం పాలకుల చోద్యంవలన ఇలాంటి మరణాలు విద్యార్థి మరణానికి పూర్తిగా ఈ ప్రభుత్వం బాధ్యత వహించి వారికి న్యాయం జరిగేలా చూడాలని ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా వసతి గృహాల్లో కమిటీలను వేసి విద్యార్థులకు సరియైన న్యాయం చేయాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుందని కంచర్ల రవిగౌడ్ అన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలను సందర్శించడం జరుగుతుందని. విద్యార్థులకు ఏమైనా అసౌకర్యాలు కలిగితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మట్టే శ్రీనివాస్, నాయకులు కోడంవెంకటేష్, వావిలాల సాయి, కోడి రోహిత్, మూడంసాయి, అరవింద్, కస్తూరి సాయి తదితరులు పాల్గొన్నారు.
