ప్రాంతీయం

మండల కేంద్రంలో విజయోత్సహ సంబరాలు…

139 Views
ముస్తాబాద్/అక్టోబర్/06; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో  టిఆర్ఎస్ శ్రేణులు స్థానిక తెలంగాణ తల్లి కూడలిలో స్వీట్లు పంచి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు..!

 ఈ సందర్భంగా మండల ఎంపీపీ జనగామ శరత్ రావు, ముస్తాబాద్ రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన ఎన్నోసంక్షేమ పథకాలే టిఆర్ఎస్ పార్టీకి విజయానికి కారణమని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన మునుగోడు ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉండి విజయ డంక మోగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు కొమ్ము బాలయ్య, విజయ రామారావు, సర్వర్ పాషా, నల్ల నరసయ్య, ఎంపిటిసి మంజుల నర్సింలు, యూత్ అధ్యక్షుడు శీలం స్వామి, ముస్తాబాద్ మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7