ప్రాంతీయం

ముందస్తు కార్యచరణ

106 Views

తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) ఏప్రిల్ 07

 

ఈ రోజు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వారి నివాసంలో  సమావేశమయ్యారు.

లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులకు బాధ్యతల కేటయింపు తదితర అంశాల పై ఈ సందర్భంగా చర్చించారు.

అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి,భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు,వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found