Breaking News నేరాలు ప్రకటనలు

కారు ప్రమాదంలో దుర్గయ్య గౌడ్ మృతి.. ఇద్దరికీ గాయాలు

325 Views

కారు ప్రమాదంలో గాయపడిన దుర్గయ్య మృతి
– ఇద్దరికీ గాయాలు
– సంఘటన స్థలానికి జడ్పిటిసి, సెస్ డైరెక్టర్, సింగిల్ విండో అధ్యక్షులు
:కారు బోల్తా పడి గంట దుర్గయ్య 46 మృతి చెందాడు. ఉశి సునీల్, డ్రైవర్ శ్రీమాన్ లకు గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గీతా కార్మికుడు దుర్గయ్య, సునీల్, శ్రీమాన్ లు వ్యక్తిగత పనులపై హైదరాబాద్ కు వెళ్లి తిరుగు ప్రయాణంలో సిద్దిపేట జిల్లా సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా పడింది. సమాచారం అందుకున్న జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, సెస్ డైరెక్టర్ వర్ష కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి లు సంఘటన జరిగిన స్థలానికి చేరుకొని జరిగిన ప్రమాదాన్ని పరిశీలించారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.కుటుంబ సభ్యులు లబోదిబో మంటూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. గీతా కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల రెడ్డి కోరారు.జరిగిన సంఘటనను సిద్దిపేట పోలీసులు వివరాలు సేకరించారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *