ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో చిత్రకళ పోస్టర్ ఆవిష్కరణ

55 Views

మంచిర్యాల లో చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ ని ప్రారంభించిన ప్రముఖ చిత్రకారుడు ఏలూరి శేషబ్రహ్మం..
– అకాడమీ ఆధ్వర్యంలో మొట్టమొదటి చిత్రకళా పోటీలకు సంబందించిన పోస్టర్ ఆవిష్కరణ

మంచిర్యాల జిల్లా.
చిత్రాకళా రంగంలో నూతన ఒరవడి సృష్టించే దిశగా మంచిర్యాల ఆర్టీస్ట్, ఆర్ట్ టీచర్ చిప్పకుర్తి శ్రీనివాస్ ఔత్సాహిక చిత్రకారులకు, టీసీసీ (చిత్రకళ)లో లోయర్, హయ్యర్ పరీక్షార్థులకు శిక్షణ ఇవ్వాలని, దూరవిద్య ద్వారా ఫైన్ ఆర్ట్స్ లో డిప్లొమా కోర్స్ ని అందుబాటులోకి తీసుకురావాలని, మంచిర్యాల కేంద్రంగా “చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ” ని ఈరోజు స్థానిక వివేకవర్థిని డిగ్రీ కాలేజీ లో ప్రముఖ చిత్రకారుడు, ఆర్ట్ డైరెక్టర్ శ్రీ ఏలూరి శేష బ్రహ్మం  చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ చిత్రాకళా రంగం లో ఎందరో జీవనం కొనసాగిస్తున్నప్పటికి చిత్ర కళని ఒక వృత్తిగా ఎంచుకుని, నేర్చుకున్న విద్యని నలుగురికి పంచాలనే ఆలోచన శ్రీనివాస్ కి రావడం అభినందనీయమని, శ్రీనివాస్ తనకి ఎంతో కాలంగా పరిచయమని, సినిమారంగం ఆర్ట్ విభాగంలో సేవ చేస్తున్నాడని, సినీ చిత్రకళారంగాలలో నే కాకుండా ఇతర రంగాల్లో కూడా చాలా అవకాశాలున్నాయని, వాటిని వినియోగించుకుని ఎదగాలని తెలియజేస్తూ శ్రీనివాస్ ని సత్కరించి అభినందించారు. ఈ అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెలలో మొట్టమొదటి చిత్రకళా పోటీలకు సంబందించిన పోస్టర్ ని ముఖ్య అతిధి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమం లో శేషబ్రహ్మం తో పాటు, భారతీయ కళాకార్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగంటి మంజుల, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రాజేశ్వర్ లతో పాటు మంచిర్యాల జిల్లా సీనియర్ చిత్రకారులు కంకణాల సత్యనారాయణ, చిప్పకుర్తి సత్యనారాయణ, ఎర్రవెల్లి యాదగిరి, మాదరబోయిన మూర్తి, మైదం మల్లేష్, బొంకూరి రాజు, గనముక్కుల మల్లేష్, ధర్మపురి శ్రీనివాస్, ముడి మడుగుల స్వామి, ఇరికల్ల శ్యామ్, నరిగె శేఖర్, దామోదర్, విజయ్, సుదర్శన్, రవిరాజు, నూటెంకి రవీందర్, కిరణ్, సంపత్, సంతోష్, కళ్యాణ్ అకాడమీ విద్యార్థులు సందీప్, వెన్నెల, శిరీష, హరికృష్ణ, రోహిత్, సింధూర, తదితరులు పాల్గోన్నారు. చిప్పకుర్తి శ్రీనివాస్ అతిధులుగా వచ్చిన శేషబ్రహ్మం కి శాలువా పుష్పగుచ్చం తో ఘనంగా సన్మానించి, పాల్గొన్న చిత్రకారులందరికి ఆత్మీయ సత్కారం చేశారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్