మంచిర్యాల జిల్లా
తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సమస్యల గురించి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి జిల్లా నాల్గవ తరగతి అధ్యక్షులు గీట్ల సుమీత్ మహిత ఉద్యోగుల సమస్యల వివిధ శాఖలలో మండలాల్లో వారికి కనీస మౌలిక వసతుల గురించి మహిళ ఉద్యోగులు ఆఫీసులలో రాత్రి వేళలో మహిళా ఉద్యోగులు డ్యూటీ విషయంలో వారికి కష్టం కాబట్టి వారికి సమయపాలనలో కొంచెం వెసులుబాటు కలిగించాలని
మరియు తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం భవము స్థలము ఆక్రమణకు మాజీ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కూరపాటి రాజయ్య కుమారులు కూరపాటి వీరేంద్ర మరియు కూరపాటి కిరణ్ కుమార్ పై
కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.
కలెక్టర్ స్పందిస్తూ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘనికి పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్, సెక్రటరీ గోవర్ధన్, కోశాధికారి శ్రీనివాస్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు 350 మంది జిల్లాలో పని చేసే సభ్యులు పాల్గొనడం జరిగింది.
