ముస్తాబాద్, ఆగస్టు 3 (24/7న్యూస్ ప్రతినిధి): మదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యమని సీఐ కృష్ణమూర్తి.. విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు పడకుండా అవగాహన పెంచుకునే దిశగా మండలంలో
పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ముస్తాబాద్ మండలంలో నార్కోటిక్స్‌తో కలిసి మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్, డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన సమావేశంలో సీఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు అలవాటు పడితే అది జీవితాన్నే నాశనం చేస్తుంది. అదేవిధంగా డ్రగ్స్ మాదకద్రవ్యాలపట్ల తలెత్తే పరిణామాలు గూర్చి వివరించారు. మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతోపాటు మొత్తం 250 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సీహెచ్. గణేష్ కృష్ణమూర్తి, సిబ్బంది ఉన్నారు.




