వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలో బలగం సినిమా గ్రామ ప్రజలకు చూపించడం జరుగుతుంది. ఈ సినిమాని సాయంత్రం ఏడున్నర గంటలకు మొదలుపెట్టారు. బంధాలు బంధుత్వాలు, మానవత్వాలు మంచితనాలు, మన రక్తంలో ఉంటాయి కదా, ఆ సంగతి మర్చిపోయారు జనాలు, సినిమాలు చూసి బంధాలు పెంచుకునే స్థాయికి దిగజారి పోయాం మనం. కానీ దేనికదే చెప్పుకోవాలి సినిమా బాగుందట. పోనీలే సినిమా వల్ల బంధుత్వాలు పెరుగుతాయి అంటే మంచిదేగా. ముందు ముందు మనుషుల జీవితాల్లో ఇలాంటి బంధాలు ఉండేవట అని చెప్పుకోవాల్సిన స్థాయికి వస్తది కావచ్చు, అవి కూడా సినిమాలు తీస్తే జనాలు చూసి అప్పుడు గాని బంధాలు బంధుత్వాలు పెంచుకుంటారు. ఈ సినిమాల వల్లనైనా మనుషుల్లో మార్పులు వస్తే మంచిదే.మార్పు మంచిదే.
