ఇంద్ర ప్రసాద్, తిమ్మాపూర్ ఎక్సైజ్ సిఐ
(తిమ్మాపూర్ నవంబర్ 23)
ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలుంటాయని తిమ్మాపూర్ సర్కిల్ ఎక్సైజ్ సిఐ ఇంద్ర ప్రసాద్ హెచ్చరించారు.
గురువారం రోజన మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామ శివారులో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా తాళ్ళపల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి, అక్రమ మధ్యం తరలిస్తుండగా 95 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. అక్రమ మధ్యం, నాటు సారాయి, గంజాయి నిల్వ చేసినా, రవాణా చేసినా, అమ్మినా కఠిన చర్యలు వుంటాయని సిఐ పెచ్చరించారు.
ఈ తనిఖీలలో ఎస్సైలు శ్రీకాంత్, సరిత, హెడ్ కానిస్టేబుల్ రాజేశం, సిబ్బంది సురేష్, కొండల్ రెడ్డి, రజిత తదితరులు పాల్గొన్నారు.