(తిమ్మాపూర్ జూలై 30)
తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య చలో ఢిల్లీ కరపత్రం ఆవిష్కరణ చేశారు.. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ మాలమహానాడు ఆగస్టు 7,8,9 వ తేదీల్లో జాతీయ మాలమహానాడు ఆద్వర్యంలో హలో మాల ఛలో డిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పలు సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ లో సామాజిక చైతన్య దీక్షలు చేపట్టనున్నరు..
ఈ దీక్షలకు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ తో పాటు, జాతీయ సామాజిక ఉద్యమ నేతలు హాజరు కానున్నాట్లు తెలిపారు. కావున ఈ దీక్షలలో పాల్గొనేందుకు కరీంనగర్ జిల్లా నుండి మాలలు, దళిత గిరిజన బహుజన సంఘాలు మేధావులు భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, రాష్ట్ర మాల సాంసృతిక కన్వీనర్ ఎలుక దేవయ్య, ముద్ధమల్ల లక్ష్మి, స్వరూప, గ్రామశాఖ అధ్యక్షులు కార్యదర్శి బూడిద రమేష్, అశోధ అంజయ్య, నిరేటి మొగిలి,బోగం వెంకటి, ఆశోధ నర్సింగ్, తమ్మల రమేష్, అశోధా భూమయ్య, అశోద మహేష్, మారెళ్ల కొమురయ్య బూడిద వేంకటి, వేముల దేవేందర్, దూస కొండయ్య, బూడిద శ్రీనివాస్,బూడిద కొమురయ్య,వేముల అనిల్,మేడి హరీష్ , బూడిద పోచయ్య, అసోద చంద్రయ్య, బూడిద రాజు, అశోదా బాలయ్య,వేముల సంపత్, చింతల విమల, బొగం చంద్రయ్య, మేడి సంపత్,తదితరులు పాల్గొన్నారు.