రుణమాఫీతో రైతన్నల ఆనందం..
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి..
(తిమ్మాపూర్ జూలై 30)
రుణమాపి దేశానికే రోల్ మోడల్ అని,సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధవుడని, రైతుల పాలిట దేవుడాని తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి కొనియాడరు.
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలో భాగంగా పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టో విడుదల చేసింది.. ఇచ్చిన మాట ప్రకారం లక్ష లోపు రుణమాపి ఉన్న రైతులకు జూలై 18న 11 లక్షల రైతులకు 6 వేల కోట్లను విడుదలచేసిందని, మంగళవారం రోజున లక్ష 50 వేల లోపు ఉన్న 7 లక్షల మంది రైతులకు 7 వేల కోట్లను రుణమాపి చేసిందని, అలాగే ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ వున్న రైతులకు మూడోవిడతలో మాఫీ చేస్తుందని, మొత్తం మూడు విడుతలలో కలిపి 30 వేల కోట్ల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మాఫి చేసి తీరుతుందని మోరపల్లి రమణారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని, గత ప్రభుత్వ హయాంలో రైతులకు మేలు జరగలేదని, బీఆర్ఎస్ పార్టీ అనుచరులకే రుణమాఫీ తో పాటు దళిత బంధు, మైనార్టీ బందు, బీసీ బందులు వచ్చాయి తప్ప సామాన్య ప్రజలకు మేలు జరగలేదని బీఆర్ఎస్ పార్టీ పైన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ వస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి మేలు చేసిందని, రుణమాపి పట్ల రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. లక్షన్నర రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ కి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కి తిమ్మాపూర్ మండల రైతుల పక్షాన,కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు…