తెలంగాణ లో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఆయా నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ సభల్లో పాల్గొంటు వరాల జల్లు కురిపిస్తున్నారు.
గురువారం నిర్మల్ జిల్లాలో ప్రజా ఆశ్వీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డిని గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ వచ్చాక ఎన్నో జిల్లాలుగా ఏర్పాటు చేసుకుని అభివద్ధిని సులభతరం చేసుకుంటున్నామని ఇంద్రకరణ్ రెడ్డి చొరవతో అయన కోరిక మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా ఏర్పాటైందని తెలిపారు.
నిర్మల్ జిల్లా అభివద్ధిలో దూసుకుపోతోందని అటువంటి నిర్మల్ జిల్లాకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసుకున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లా ఏర్పడం వల్లే అభివృద్ధి జరుగుతోందని ఈ ఘనత అంతా ఇంద్రకరణ్ రెడ్డిదేనని మరోసారి ఆయన్ని గెలిపిస్తే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
