సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శుక్రవారం నాడు సంగాపూర్ రోడ్డు లో ఎడ్యుకేషన్ హబ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మెడినోవా డయాగ్నొస్టిక్ సెంటర్ ను ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్, మాదాసు శ్రీనివాస్, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూo రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత వ్యాపార మార్గాలను అన్వేషించాలని నూతనంగా ప్రారంభించిన మెడినోవా డయాగ్నస్టిక్ సెంటర్ యజమానులు ఎడ్ల నర్సింలు, ఎస్ లక్ష్మణ్, పి నరేష్ ను అభినందించారు,వినియోగదారుల మన్నన పొందుతూ మంచి గుర్తింపు పొందాలని,ఆకాంక్షించారు గజ్వేల్ దినదిన అభివృద్ధి చెందుతుందని అత్యాధునిక వైద్య పరికరాలతో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జఖీయుద్ధున్, స్థానిక కౌన్సిలర్ గుంటుకు శిరీష రాజు,కౌన్సిలర్స్,కో ఆప్షన్ సభ్యులు,బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
