ప్రాంతీయం

నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్.

116 Views

పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్.

సిద్దిపేట జిల్లా,జనవరి 29, తెలుగు న్యూస్ 24/7

రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేర్యాల పట్టణంలోని పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ఓల్డ్ సీ హెచ్ సీ) లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఈరోజు సందర్శించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకమైన వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులనకు సూచించారు.నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను కమిషనర్ స్వయంగా పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు.ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బంది  ఎన్నికల అధికారులతో మాట్లాడి, వారికి తగు సూచనలు చేశారు. అనంతరం, చేర్యాలలోని ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్‌ను,సదర్శించారు.వాహనాల తనిఖీ తీరును పరిశీలించి, అక్రమ నగదు, మద్యం రవాణాపై క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు మరియు రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ బానోతు రమేష్ , ఎస్సై నవీన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *